మేష రాశి (Aries): భాగ్య, వ్యయ రాశుల నాథుడైన గురువు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఎప్పుడు ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుందో తెలియని పరిస్థితి అనుభవానికి వస్తుంటుంది. అనవసర, ఆకస్మిక ప్రయాణాలవల్ల డబ్బు ఖర్చవుతుంటుంది. తీర్థ యాత్రలకు, మొక్కులు చెల్లించుకోవడానికి మాత్రం సమయం అనుకూలంగా ఉంది. పని ఒత్తిడి ఉంటుంది.
తుల రాశి (Libra): ఉద్యోగుల కన్నా వృత్తి, వ్యాపారాల వారికే అన్ని విధాలా బాగుంటుంది. లాయర్లు, చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): ఉద్యోగ జీవితంలో కొద్దిగా సమస్యలు తప్పకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కావు. వ్యాపారులకు లాభాలు వెనుకపట్టు పడతాయి. వైద్య ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
మకర రాశి (Capricorn): ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉ౦ది. కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కుంభ రాశి (Aquarius): అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంటుంది. ధన స్థానంలో గురువు ఉన్నా రాశిలో శని ఉండడం వల్ల ఏదీ చేతికి అందదు. శుభ ఫలితాలకు అవకాశం ఉన్నా ఏదీ అనుభవంలోకి రాదు. మధ్య మధ్య ఆరోగ్యం సవాళ్లు విసురుతూ ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగానే గడిచిపోతుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.