వృషభ రాశి (Taurus) : ఉద్యోగ జీవితం కొద్దిగా పరవాలేదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
మిథున రాశి (Gemini) : ఉద్యోగం మారడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. స్నేహితులు అపార్ధం చేసుకునే సూచనలున్నాయి. కుమార్తెకు పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆధ్యాత్మిక చింతన పరుగుతుంది. విద్యార్ధులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
కర్కాటక రాశి (Cancer) : ఉద్యోగంలో కొన్ని చిక్కులు తొలగుతాయి. బాధ్యతల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని పనులు అలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తారు.
సింహ రాశి (Leo) : ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం నిలడగా ఉంటుంది. కొద్దిగా రుణ విముక్తులవుతారు. పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త, విద్యార్ధులకు పరవాలేదు. స్నేహితురాలి మీద ఖర్చు పెరుగుతుంది.
తుల రాశి (Libra) : ఉద్యోగంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్పెక్యులేషన్ లాభించదు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి ను౦చి సహకారం లభిస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio) : ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద ఖర్చుచేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడతాయి.
ధనస్సు రాశి (Sagittarius) : ఉద్యోగంలో సహోద్యోగులకు బాగా సహాయపడతారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థికలావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. రాదనుకున్న డబ్బు చాలావరకు తిరిగి వస్తుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
మకర రాశి (Capricorn) : ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆదాయం సరిపోక ఇబ్బంది పడతారు. విద్యార్ధులకు పరవాలేదు. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. స్నేహితురాలి మీద బాగా ఖర్చు అవుతుంది. ఆర్ధిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. బంధుమిత్రులు ఇబ్బంది పెడతారు.
కుంభ రాశి (Aquarius) : అధికారులు, సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి మాట్టాడండి. అదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. కుమారుడికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్ధులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలు బాగా బిజీ అయిపోతుంది. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.