Horoscope Today: మే 18 రాశి ఫలాలు. ఇవాళ కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య బాగుంటుంది. మరికొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని రాశుల విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. మేష నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఇక్కడ చూద్దాం.
తుల రాశి (Libra): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థాన చలన సూచనలున్నాయి. బంధువులతో విభేదిస్తారు. కొత్త ప్లాట్ కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
ధనస్సు రాశి (Sagittarius): శుభకార్యం తల పెడతారు. స్థాన చలనం కలుగుతుంది. సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఒక పట్టాన పెళ్లి సంబంధం కుదరదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. రుణ బాధ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కుంభ రాశి (Aquarius): ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త, యేమ వ్యవహారాలు మానసిక ఒత్తిడినిస్తాయి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.