వృశ్చిక రాశి (Scorpio): ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని లాభాలుంటాయి.
ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక కుటుంబ సమస్య కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.