మేష రాశి (Aries): ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృషభ రాశి (Taurus): ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోండి. స్నేహితుల సహాయంతో కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.
మిథున రాశి (Gemini): ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఇరుగు పొరుగుతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులు మరింత శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి.
కర్కాటక రాశి (Cancer): ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంతా మీరనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ముఖ్యమైన పనుల్లో ప్రతికూలతలుంటాయి. పలుకుబడిగల వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
సింహ రాశి (Leo): ఆశించినంతగా ఆదాయం పరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య రాశి (Virgo): కలిసి వచ్చే కాలం ఇది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారుల లాభార్జన నిలకడగా కొనసాగుతుంది. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
తుల రాశి (Libra): ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాన్నిస్తుంది. కొందరు చిన్ననాటి స్నేహితులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. పిల్లల్లో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు సిద్దిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): వ్యాపారులకు నిలకడగా లాభాలు కొనసాగుతాయి. ఉద్యోగంలో పై అధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి నిపుణులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పరిచయస్తులతో వివాహ సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius): గురు, శని గ్రహాల అనుగ్రహం వల్ల కొన్ని శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రుల్లో పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది.
మకర రాశి (Capricorn): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రేమించినవారితోనే వివాహ సంబంధం ఖాయమవుతుంది. మిత్రుల ఆర్థిక సహాయం అందిస్తారు. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండడం మంచిది. ఒక స్నేహితుడిని సమస్య నుంచి తప్పిస్తారు.
కుంభ రాశి (Aquarius): ఏలిన్నాటి శని కారణంగా ''అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి'' అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచండి. విహార యాత్రకు వెళ్లడం ఉత్తమం. ప్రతి పనికీ బాగా చెమటోడ్చాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. వ్యాపారులకు కొద్దిగా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురు దెబ్బలు తగలవచ్చు.
మీన రాశి (Pisces): ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మీవల్ల కొందరికి కొన్ని మంచి పనులు జరుగుతాయి. వృత్తి నిపుణుల జీవితంలో సానుకూలమైన మార్పు ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో స్వయం ఉపాధివారు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.