కర్కాటక రాశి (Cancer): ఉద్యోగంలో ప్రమోషన్‌కు లేదా ఇంక్రిమెంట్‌కు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు.