Horoscope today: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా దిగజారుతున్నాయి. కరోనా సమస్యలు పెరుగుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక పరమైన అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది. రాశి ఫలాల ద్వారా ఎదురవ్వబోయే సమస్యల్ని ముందుగానే కొంతవరకూ తెలుసుకోవచ్చు. తద్వారా అప్రమత్తం అయి వాటి నుంచి బయటపడవచ్చు. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 10-4-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (image credit - shutterstock)