Horoscope Today: అక్టోబర్ 18 రాశిఫలాలు..రాబోయే వేడుక కోసం సిద్ధంగా ఉండండి
Horoscope Today: అక్టోబర్ 18 రాశిఫలాలు..రాబోయే వేడుక కోసం సిద్ధంగా ఉండండి
ఓ రాశివారు ఎక్కువ పని, సామాజిక కట్టుబాట్లతో అలసి పోయినట్లు ఫీల్ అవుతారు. మరికొందరు పనిని మొదలుపెట్టే ముందు అతిగా ఆలోచించకూడదు. కొందరు విదేశాల నుంచి పాజిటివ్ న్యూస్ వింటారు. అక్టోబర్ 18వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
ఓ రాశివారు ఎక్కువ పని, సామాజిక కట్టుబాట్లతో అలసి పోయినట్లు ఫీల్ అవుతారు. మరికొందరు పనిని మొదలుపెట్టే ముందు అతిగా ఆలోచించకూడదు. కొందరు విదేశాల నుంచి పాజిటివ్ న్యూస్ వింటారు. అక్టోబర్ 18వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 13
మేషం : అధిక పని, సామాజిక కట్టుబాట్ల కారణంగా మీరు కొంచెం అలసిపోయినట్లుగా భావిస్తారు. క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ కొత్త ప్రాజెక్ట్‌ను నిర్వహించడంలో సహాయపడవచ్చు. రాబోయే వేడుక కోసం సిద్ధంగా ఉండండి. లక్కీ సైన్- టర్క్వాయిస్ స్టోన్
3/ 13
వృషభం : మీరు ఏదైనా పనిని చేపట్టడానికి ముందే.. ఎదురుకాబోయే పరిస్థితుల గురించి ఊహించవద్దు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడం కారణంగా మీ మనస్సు అస్తవ్యస్తంగా అనిపించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. లక్కీ సైన్- సిరామిక్ బౌల్
4/ 13
మిథునం : మీకు మీరే కొత్త కమిట్మెంట్స్ను ఏర్పరుచుకోండి, కొత్త గైడ్‌లైన్స్ సెట్ చేసుకోండి. వాటిని పాటించేలా శక్తులు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. విదేశాల నుంచి అందే సానుకూల వార్తలు లేదా సంభాషణలు మీ మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. లక్కీ సైన్- మోనోక్రోమ్ బ్యాగ్
5/ 13
కర్కాటకం : ఒక వాదన మధ్యాహ్నానికి అంతరాయం కలిగించవచ్చు. మీ సంబంధం క్రమంగా బలపడుతుంది. ఇరుక్కుపోయినట్లు కనిపించే విషయాలలో మీరు నిపుణులను సంప్రదించే అవకాశం ఉంది. లక్కీ సైన్- గిఫ్ట్
6/ 13
సింహం : కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశం ఉంది. మీ పని కొంతకాలం పాటు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న కొన్ని చట్టపరమైన విషయాలు ఇప్పుడు ఊపందుకుంటాయి. లక్కీ సైన్- డెకరేటెడ్ రూం
7/ 13
కన్య : పనిలో ఆకస్మిక అభివృద్ధి మీ రోజును ప్రకాశవంతం చేస్తుంది. మీ జీర్ణక్రియను జాగ్రత్తగా చూసుకోండి. మీ వేగాన్ని కొంత తగ్గించడం వలన మీకు తర్వాత ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఇప్పుడు ముందుగా ప్లాన్ చేయడం ప్రారంభించవచ్చు.లక్కీ సైన్- న్యూ ల్యాంప్
8/ 13
తుల : మీ ఇమేజ్ కుటుంబం, స్నేహితుల మధ్య పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కన్వర్జేషన్‌ను మీరు వాయిదా వేస్తూ వస్తుంటే.. ఇప్పుడు దాన్ని పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. రోజు ముగింపు మిమ్మల్ని మరింత రిలాక్స్‌గా, స్థిమితంగా ఉంచుతుంది. లక్కీ సైన్- నిర్మలమైన ఆకాశం
9/ 13
వృశ్ఛికం: కొంతమంది తెలిసిన వ్యక్తులు మీ గురించి గాసిప్ చేయవచ్చు. మీరు ఈరోజు స్వయం సమృద్ధిగా ఉంటారు. పనిలో మీకు కొత్త రోల్ ఇవ్వడం గురించి చర్చిస్తారు. ఫ్యామిలీ ఫ్రెండ్ మంచి సహాయకారిగా ఉంటాడు.లక్కీ సైన్- అంబెర్ స్టోన్
10/ 13
ధనస్సు : పాత ఫొటోలు దీర్ఘకాలంగా మరచిపోయిన జ్ఞాపకాన్ని గుర్తుచేస్తాయి. కొన్ని ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండవచ్చు. ముందుకు సాగని విషయాలను పరిష్కరించడానికి స్పష్టమైన మానసిక స్థితి సహాయపడుతుంది. మీకు సంబంధించిన మెసేజ్‌ను అందుకొనే సూచనలు ఉన్నాయి. లక్కీ సైన్- ఎమరాల్డ్
11/ 13
మకరం : సంక్లిష్టమైన విషయాల పట్ల మీ విధానాన్ని సులభతరం చేయండి. పరిష్కారం కాని వాటి గురించి మళ్లీ ఆలోచించండి. ఈ రోజు పనులను ముందుకు తీసుకెళ్లడానికి శక్తి సహకరిస్తుంది. ధ్యానం చేయడం మేలు. లక్కీ సైన్- సరస్సు
12/ 13
కుంభం : స్నేహితుడి నుంచి చిన్న సంజ్ఞలు మీ రోజును మార్చగలవు. షాపింగ్‌కు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ రోజును మీరు ఆనందిస్తారు. బయట తినడానికి మీ ఇష్టాన్ని పరిమితం చేయండి. మరింత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండటానికి ప్రయత్నించండి. లక్కీ సైన్- సైన్ బోర్డ్
13/ 13
మీనం : కొత్త రిలేషన్ బలపడటానికి సమయం పడుతుంది. మీరు ఓపికగా ఉండాలి. కొత్తగా కమ్యూనికేషన్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీరు పూర్తి చేయలేని కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ దూకుడును అదుపులో ఉంచుకోండి. లక్కీ సైన్- సిల్వర్ వైర్