Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 19-11-2021 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
పనులు పూర్తి కావడానికి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో అనుకోని సమస్య ఒకటి ఎదురవుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో శుభవార్త వింటారు. మిత్రులు సహాయపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ప్రమాదాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. సమయానికి సాయం అందుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగిపోతాయి. స్వయంకృషితో మంచి పేరు తెచ్చుకుంటారు. సంపద పెంచుకునే ఆలోచన చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడిని తట్టుకుని సత్ఫలితాలు సాధిస్తారు. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2)
ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఎదురవుతున్న అవరోధాలు తొలగుతాయి. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కృషి సత్ఫలితాలనిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగపరంగా మంచి సమయం. వ్యాపారంలో శ్రమ పెరిగినా చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. మిత్రులకు మీ వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అన్ని విధాలా అనుకూల సమయం. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.