మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతారు. వ్యాపార రంగంలోని వారు విస్తరణ కార్యక్రమం చేపడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభించవు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోకుం డబ్బు చేతికి అంది, కొంత రుణ బాధ తగ్గుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. విదేశాల నుంచి పెళ్లి సంబంధం వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయండి హామీలు ఉండొద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆరోగ్యానికి, ఆదాయానాకి ఢోకా లేదు. ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవడచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. గృహ రుణానికి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవికైనా అప్పు ఇస్తే తిరిగా రాకపోవచ్చు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2)
చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. మీ అబ్బాయిని మంచి ఉద్యోగంలో చేర్చే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. వ్యాపారులు లాభాలు అర్జిస్తారు. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహరాల్లో జాగ్రత్త. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
మీ సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు అవకాశం ఉంది. ఇరుగు పోరుగు వారికి సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థికక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంది. బాగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం ఆఫర్ వస్తుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యాపారులు, నిపుణులు లాభాలు అర్జిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగేయండి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక , ఆరోగ్య సమస్యల నుంచి గట్టేక్కే రోజులు ప్రారంభమయ్యాయి. తలచిన పనులు నెరవేరుతాయి. దూర ప్రాంతం నుంచి వివాహా సంబంధం వస్తుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు హాజరవుతారు. అనుకూల స్నేహితురాలు పరిచయం అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులు మీ సలహా తీసుకుని పాటిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఎవరికి హామీలుగా ఉండొద్దు.