మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ఒక కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభం (కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు శ్రమ మీదర పూర్తవుతాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది కానీ, దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా అదృష్ట కాలం నడుస్తోంది. ఇప్పుడు తలపెట్టిన పనులు సత్ఫలితాలనిస్తాయి. ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొవాల్సి ఉంటుంది. బంధు మిత్రుల సహాయ సహాకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో కొన్ని ప్రతి కూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్లు ముఖం చాటేస్తారు. ఒక శుభ వార్త మీ ఆందోళనను తగ్గిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. మీవల్ల కొందరికి మంచి ఉపకారం జరుగుతుంది. వ్యాపారం జాగ్రత్త. వృత్తి, నిపుణులు రాణిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మంచి యోగం పట్టేకాలం ఇది. వీలైనంతగా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న ప్రయత్నంతోనే ముఖ్యమైన పనులు వెనువెంటనే పూర్తవుతాయి. ధనలాభానికి అవకాశం ఉంది. అధికారుల వలన మేలు జరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుండి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి, శ్రమ ఎక్కువవుతుంది. ఆటంకాలు ఎదువుతున్నా.. ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా బాగా ఒత్తిడిగా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబపరంగాను, ఉద్యోగ పరంగాను మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల విషయంలో కాలం అనుకూలిస్తోంది. పదవీ లాభం కనిపిస్తోంది. వ్యాపారం లాభదాయకమవుతుంది. బంధు మిత్రులకు మీ ద్వారా మేలు జరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
మీ ప్రయత్నాలు ఫలించి ఆర్థికంగా, ఉద్యోగపరంగా కొద్దిగా పురోగతి చెందుతుంది. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వృత్తిలో కొందరు సన్నిహితుల నుంచి సహాయ సహాకారాలు అందుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. హామీగా ఉండవద్దు. వ్యాపారంలో ఫలితాలుంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ,వ్యాపారాలలో పట్టుదలగా లక్యాలను పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొద్దిగా లాభపడతారు. ఒక విశేష శుభం జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. కలహాలకు, విభేదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఆర్థిక ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద పనులు కొన్ని పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ కోరిక ఒకటి నెరవేరుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. శ్రద్ధపెడితే ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. ఆదాయం పరవాలేదు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. స్పెక్యులేన్ పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగపరంగా సకాలంలో బాధ్యతలు,లక్యాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో కొన్ని చికాకులు చోటు చేసుకుంటాయి. ముఖ్య కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో విశేష లాభాలు సంపాదిస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధు మిత్రులకు సాయపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.