మేషం(అశ్విని,భరణి,కృత్తిక 1)ఊహించని విధంగా ఉద్యోగంలో మంచి జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంటా బయటా ఒత్తిడి కలిగించే పరిస్థితులుంటాయి. ప్రశాంతంగా కూర్చుని మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కలిసి వస్తుంది. వ్యాపార లాభం కనిపిస్తోంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
వృషభం(కృత్తిక 2,3,4,రోహిణి,మృగశిర 1,2)ఉద్యోగంలో శక్తికి మంచి కష్టపడడం జరుగుతుంది. వ్యాపారంలో ప్రత అడుగు జాగ్రత్తగా వేయాలి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని పనుల్లో శ్రమ వృథా అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి నిపుణులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మక చిత్రం)
మిథునం(మృగశిర 3,4,ఆర్థ్ర,పునర్వసు 1,2,3)గ్రహ స్థితి బాగున్నందువల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది. మంచి జీవితానికి పనికివచ్చే పనులు చేస్తానే. అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆశించిన స్థాయిలో వ్యాపారపరంగా లాభాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో వ్యక్తిగ సమస్య పరిష్కరించుకుంటారు. శుభవార్తా శ్రవణం. ఆరోగ్యం పరవాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం(పునర్వసు4,పుష్యమి,ఆశ్లేష)ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆటంకాలు ఎదురైనా ఆర్థి పరిస్థితి అనుకూలించకపోయినా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబపరంగా మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
సింహం(ముఖ,పుబ్బ,ఉత్తర 1)గ్రహ స్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పది మందికి మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనుల్ని చక్కగా పూర్తి చేస్తారు. డబ్బు జాగ్రత్త.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య(ఉత్తర 2,3,4,హస్త,చిత్త 11,2)ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. అదనపు ఆదాయం కోసం అధికంగా శ్రమపడతారు. ఆటంకాలు,అవరోధాలు తొలిగి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొంత వరకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్పెక్యులేషన్ జోలికి వెళ్లవద్దు.(ప్రతీకాత్మక చిత్రం)
తుల(చిత్త 3,4,స్వాతి,విశాఖ 1,2,3)ఉద్యోగంలో మీ అభివృద్ధికి అవరోధాలు సృష్టించేవారుంటారు. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలను శ్రధ్ధగా,సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. బంధువుల ఒత్తిడి కారణంగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం(విశాఖ 4,అనురాధ,జ్యేష్ఠ)ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి సమస్యలు,ఒత్తిడి ఉంటాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు(మూల,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ 1)ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో బయటివారితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సన్నిహితుల కారణంగా ఆర్థిక నష్టం జరగడానికి అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
మకరం(ఉత్తరాషాఢ 2,3,4,శ్రవణం,ధనిష్ఠ 1,2)ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి,వ్యాపారాల్లో ధనలాభం ఉంది. కుటుంబంలో అనుకోని చికాకులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. స్పెక్యులేషన్ లాభించదు.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభం(ధనిష్ఠ 3,4,శతభిషం,పూర్వాభాద్ర 1,2,3)ఉద్యోగంలో శ్రమ,ఒత్తిడి బాగా పెరుగుతాయి. అంతా మన మంచికే అనుకోండి. మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. వ్యాపార లాభం కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజానికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సన్నిహితులతో ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. స్పెక్యులేషన్ పరవాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
మీనం(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర,రేవతి)కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో తగినంత గౌరవం. ఉపకార బుద్ది వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభార్తలు వింటారు. వృత్తిలో రాణిస్తారు. పిల్లలు చదువుల్లో మంచి పురోగతి సాధిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)