Zodiac Signs : అమ్మాయిలను పడగొట్టడంలో ఈ రాశుల వారు యమా ఫాస్ట్.. మీరూ ఉన్నారో లేదో చూసుకోండి
Zodiac Signs : అమ్మాయిలను పడగొట్టడంలో ఈ రాశుల వారు యమా ఫాస్ట్.. మీరూ ఉన్నారో లేదో చూసుకోండి
Most Flirting Zodiac Signs : యుక్త వయసు వచ్చిన తర్వాత అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు తోడు కోరుకోవడం సహజం. కొన్ని రాశుల వారు అమ్మాయిలను ఆకట్టుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు ఆ రాశుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాశుల ద్వారా వ్యక్తుల గుణగణాలను అంచనా వేయడం అనాదికాలం నుంచి వస్తోన్న సంప్రదాయం. అయితే ప్రతి రాశి వారు ఒకేలా ప్రవర్తించే అవకాశం లేదు. కానీ, అమ్మాయిల విషయంలో కొన్ని రాశుల వారు ఒకే విధంగా ప్రవర్తిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
యుక్త వయసు వచ్చిన తర్వాత అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు తోడు కోరుకోవడం సహజం. కొన్ని రాశుల వారు అమ్మాయిలను ఆకట్టుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు ఆ రాశుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
3/ 8
మేషరాశికి చెందిన అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడంలో మిగిలిన రాశుల వారి కంటే ముందుంటారు. వీరు ఎటువంటి సందర్భంలోనైనా సరే తమ వాక్చాతుర్యంతో అమ్మాయిల దృష్టిలో ఇట్టే పడగలరు. నచ్చిన అమ్మాయిపై పొగడ్తల వర్షం కురిపించి వారి మనసును దోచే నేర్పు వీరి సొంతం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అమ్మాయిలను ఆకట్టుకునే జాబితాలో మేషరాశి వారి తర్వాతి స్థానం మిధున రాశి వారిదే. వీరికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. వారిని ఎలా ఆకట్టుకోవాలో కూడా తెలుసు. సందర్భోచితంగా తమకు నచ్చిన అమ్మాయితో వ్యవహరించడం వీరి సొంతం. వీరి మాటలకు అమ్మాయిలు పడిపోవాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఆకట్టుకునే అందం తులారాశి వారి సొంతం. వీరు తమ అందంతో అమ్మాయిలను ఆకట్టుకోవడంలో ముందుంటారు. వీరు తక్కువగా మాట్లాడినా వీరి ప్రవర్తన అమ్మాయిలను కట్టిపడేస్తుంది. హుందాగా వ్యవహరించడంలో తులారాశి వారికి వీరే సాటి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
స్నేహంగా ఉండటం ధనుస్సురాశి వారి ప్రధాన బలం. ఇతరులను పొగడటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇదే అమ్మాయిలకు వీరిపై మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేస్తుంది. వీరు ఎక్కడ ఉన్నా ఆ చోటు మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది. వీరికి తెలియకుండానే అమ్మాయిలను ఆకట్టుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
సింహరాశి వారు చాలా నిజాయితీ పరులు. తమ ప్రేమలో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. తమకు నచ్చిన వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే చూస్తు ఊరికే ఉండరు. వారిని ఎలాగైనా ఆపద నుంచి కాపేడేందుకు ప్రయత్నిస్తారు. ఈ గుణమే అమ్మాయిలకు ఈ రాశి వారి పట్ల ప్రత్యేక అభిమానాన్ని కలిగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)