మేషం (అశ్వి, భరణి, కృత్తిక 1) : సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి శ్రీ తరపు బంధువులతో బిజీగా ఉంటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు పనికిరావు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర : కలిసి వచ్చే కాలం ఇది. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పులు తీరుస్తారు. బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమలు వ్యవహారాలు ఫలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు బా గా పెరుగుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. సకాలంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఇరకాటంలో పెడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరపు బంధువులు ఇంటికి వచ్చే సూచన లున్నాయి. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెడతారు. విద్యార్థులకు కాస్తంత శ్రమ తప్పదు. కోర్టు కేసులో నెగ్గుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెళ్లి బాజాలు మోగుతాయి. ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారం పెళ్లి వైపు అడుగులు వేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త,
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2) : ప్రధాన గ్రహాల సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు, బంధువులకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసులు నెగ్గవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. విందు వినోదాల మీద ఖర్చు చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగం విషయంలో దూర ప్రాంతం నుంచి అనుకూల సమాచారం అందుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) : ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదా యం మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. కుటుంబంతో వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ప్రధాన గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న మొక్కులు చెల్లించుకుంటారు. ఆదాయం ఒక మోస్తరుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) : గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు. మీ ఆశలకు భిన్నంగా ఒక చిన్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఇరుగు పొరుగు వారితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలల్లో ఆచితూచి అడుగువేయండి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ప్రతి పనికీ శ్రమ పడాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. హామీలు ఉండొద్దు. విద్యార్థులకు బాగుంది.
మీనం (పూర్వాభాద్ర 4. ఉత్తరాభాద్ర, రేవతి) : గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసివస్తాయి. బంధువులు, స్నేహితులతో సర దాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. డబ్బు జాగ్రత్త.