మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. వ్యాపార లాభం కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజానికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో మీ ఓర్పు, సహనాలను పరీక్షించేవారున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో బయటివారితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల కారణంగా అర్థిక నష్ట౦ జరగడానికి అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా సెరుగుతుంది.
కర్కాటకం(పునర్వసు4, పుష్యమి, ఆశ్లేష) ఒక ముఖ్యమైన అర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి సమస్యలు, ఒత్తిడి ఉంటాయి. వ్యాపారుల అర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెళ్ళిప్రయత్నాలు ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలను శద్ధగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో మొహమాటాల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో విధులను నిర్వహించడంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. అధికారుల నుంచి మాట వచ్చే సూచనలున్నాయి. ఆటంకాలు, అవరోధాలు తొలగి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొంత వరకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శద్ద వహించండి. అర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఏ విధంగా చూసినా మంచి కాలం నడుస్తోంది. పదిమందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చక్కగా పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్టు రోజంతా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. ఆటంకాలు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోయినా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) అన్ని విధాలా కలిసి వస్తుంది. మంచి జీవితానికి పనికివచ్చే పనులు చేస్తారు. అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు. శుభవార్త శ్రవణం ఉంది. అరోగ్యం జాగ్రత్త.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఉద్యోగంలో మీ ప్రతిభ బాగా వ్యక్తమవుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కుటుంబంలో అందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని పనుల్లో శ్రమ వృథా అవుతుంది. అర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలమైన సమయం. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో మంచి జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంటా బయటా ఒత్తిడి కలిగించే పరిస్థితులుంటాయి. ప్రశాంతంగా కూర్చుని మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కలసి వస్తుంది.వ్యాపార లాభం కనిపిస్తోంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో తగినంత గౌరవం, గుర్తింపు లభిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. ఉపకార బుద్ది వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. వృత్తిలో రాణిస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.