వృషభం (కృత్తిక 2,3,4, రోహణి, మృగశిర 1.2) : ప్రయత్నాల్ని కొనసాగిస్తే మీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నా పలుకుతారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకిది సమయం కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : తగినంత ప్రయత్నం చేస్తే మీకు అంతా బాగుంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. విద్యార్థులకు చాలా బాగుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభి స్తాయి. సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగు తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2) : ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యక్తిగతంగా మిశ్రమ ఫలి తాలు ఉంటాయి. వ్యాపారంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణ యాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం ల భించే అవకాశం ఉంది, పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) : కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉం ది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ముఖ్యమైన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరు గుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి చోట పెళ్లి స బంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 1,2) : ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వృత్తి, వ్యా పారాల్లో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీ సుకుంటారు. రుణాలు తీరుస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) : అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలని స్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీ లు ఉండొద్దు.
మీనం (పూర్వాభాద్ర 4. ఉత్తరాభాద్ర, రేవతి) : సమయం అంతగా అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు కాస్తంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆ ర్థిక వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపారం లో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి. మిశ్ర మంగా ఉంటుంది.