మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆ శించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. ఉ ద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. - విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.
మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 ) : ఒక వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వి నోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు || దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగు తుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితు లు పరిచయమవుతారు. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2) : మంచి అదృష్ట యోగం పడుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఆదాయం పెరుగు తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. సంసార బాధ్యతలు పెరుగుతా పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) : బంధువులు సహాయంగా ఉంటారు. ఆర్థికంగా అనుకూలమయిన సమయం. ఆధ్యాత్మిక చింతన పె రుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పె రుగుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో విహారానికి వెడ తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వి ౦టారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచా రం అందుతుంది. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వ స్తాయి. ఉన్నత కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఏలిన్నాటి శ ని కారణంగా మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉన్నా మానసిక ప్రశాంతత లోపించి ఇబ్బంది పడతారు. ఏలిన్నాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉంటుంది. అయితే, తలచిన పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది.
మీనం (పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఢాకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతా నం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు మిమ్మల్ని పలకరించే అవకా శం ఉంది. విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. కొత్త ఉ ద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.