మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : గ్రహ స్థితి బాగా అనుకూలంగా ఉంది. కొన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారం లో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్ధిక లావాదే వీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉన్నా మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణ సూచనలున్నాయి. కొన్ని కష్టా ల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల వారికి చేతి నిండా పని ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
పృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ప్రస్తుతం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభి | స్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజ నాలు సమకూరుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ముఖ్యమైన పనుల్లో కొన్నిటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా పట్టుద లగా ముందడుగు వేయండి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. సన్ని హితుల సూచనలు కూడా అవసరం అని గ్రహించండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1.2) : మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల పరంగా లాభాలున్నాయి. కొత్త ప్రయత్నాలు సఫ లమవుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనుల్లో త్వరి తగతిన విజయాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు విజ యాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండొద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు తెలుస్తు ౦ది. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.