వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. అదాయం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగం మారాలనే నిర్ణయానికి వస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వీలైనంతగా దుబారాను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి అన్నివిధాలా బాగుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. అర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు అదుపుతప్పుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టుగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారుల మీద ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, దగ్గరవారికి ఆర్థికంగా సహాయపడతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. శుభవార్త ఒకటి ఊరట కలిగిస్తుంది. కుమారుడికి ఇష్టపడినవారితో పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.