మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)రోజంతా బాగానే ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆర్థిక, వ్యాపార రంగాలవారికి బాగుంది. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు సునా యాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆదాయం పెరుగుంది. ఆరోగ్యం పరవాలే దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తలపె ట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి మంచి సమాచారం అందుతుంది. బం ధువుల ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార స్థలకు బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. పెళ్లి సంబం ధాలు వెనుకపట్టు పట్టే సూచనలున్నాయి. ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకు బడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తా రు. స్నేహితురాలిపై ఖర్చు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)శుభ వార్తలు వినే సూచనలున్నాయి. ఉద్యోగంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంది. స్థాన చలనం సంభవం. తలచిన పనులు కొన్ని నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పిల్ల ల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. చాలావరకు రుణ సమస్య నుంచి బయటపడతారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
గా గడుపుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)కొద్దిగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధు మిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆ -రోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2)రోజంతా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు. స్థాన చలన సూచన లున్నాయి. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో విభేదిస్తారు. కొత్త ఫ్లాట్ కొనడా నికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ప్రే మ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు..
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)రోజంతా మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి రంగాలవారికి బాగుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాలలో పాల్గొంటారు. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకా శం ఉంది. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దూర ప్రాంతంలో కన్నా సొంత ఊర్లోనే ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితురాలి. తో షికార్లు చేస్తారు. విద్యార్థులకు బాగుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1). రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదా యం పెరిగి, రుణాలు తీరుస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది మంచి సమయం. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగానే ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువులలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహి తురాలితో ఎంతో సరదాగా గడుపుతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూ రంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు పరవాలేదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితురాలితో షికార్లు చేస్తారు