Horoscope today : రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (జనవరి 13, 2023 శుక్రవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
కన్య రాశి (Virgo) : ప్రస్తుతం మీకు ముఖ్యమైన విషయాల్లో మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం పరవాలేదు.
తుల రాశి (Libra) : ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉన్నా చివరికి మేలే జరుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణ సూచనలున్నాయి. మిత్రుల సహాయంతో కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల వారికి చేతి నిండా పని ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చిక రాశి (Scorpio) : ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన పనుల్లో కొన్నింటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా పట్టుదలగా ముందడుగు వేయండి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సన్నిహితుల సూచనలు కూడా అవసరం అని గ్రహించండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనస్సు రాశి (Sagittarius) : అదృష్టం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు తెలుస్తుంది. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.
మకర రాశి (Capricorn) : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనుల్లో త్వరితగతిన విజయాలు సిద్దిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండొద్దు, వాగ్దానాలు చేయవద్దు.
కుంభ రాశి (Aquarius) : ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
మీన రాశి (Pisces) : ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.