మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎవరితోనూ ఆర్ధిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు పలకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్త. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) కుటుంబపరమయిన చిక్కులు తొలగిపోతాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. సన్నిహిత మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టపోతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. భార్యాపిల్లలతో విందులు వినోదాల్గ్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం విషయంలో కొద్దిగా అందోళన చెందుతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్పెక్యులేషన్ పెద్దగా లాభించకపోవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగం విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలున్నాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) మంచి ఉద్యోగం దొరుకుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఇల్లుగానీ, స్థలంగానీ కొనే అలోచన చేస్తారు. వ్యాపారంలోనివారు మరింతగా శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్ళి సంబంధం కుదరవచ్చు. బంధువులకు సంబంధించిన ఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడటం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కొందరు మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2) ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం ను౦చి శుభవార్తలు వింటారు. భార్య తరపు బంధువులు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉ౦టాయి. మీ చేతుల మీదుగా ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం పరవాలేదు కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. వ్యాపారులకు ఆర్థికంగా చాలా బాగుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు కాస్తంత దూరంగా ఉండండి. ఉద్యోగంలో శ్రమ బాగా పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. శమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం అందోళన కలిగిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ఎవరికీ హామీలు ఉ౦డొద్దు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.