Horoscope Daily: నేడు మంగళవారం. చాలా రాశుల వారికి ఇవాళ శుభ సూచనలే కనిపిస్తున్నాయి. మూడు నాలుగు రాశుల వారు మినహా అందరికి మంచి జరిగే అవకాశం ఉంది. జ్యోతిష పండితులు చెప్పిన రాశి ఫలాల ఆధారంగా.. ఇవాళ కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి.ఎలాంటి సమస్యలు ఉండవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (Aries): ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అదృష్ట యోగం ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ధనం కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పొదుపు చర్యలు చేపడతారు.
వృషభ రాశి (Taurus): ఈ రాశి వారు ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. భక్తి భావాలు పెరుగుతాయి. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగి కష్టాలు తెచ్చుకోద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
మిథున రాశి (Gemini): ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తలపెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకుండా ఉండడమే మంచింది.
కర్కాటక రాశి (Cancer): ఈ రాశివారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులు, స్నేహితులు అన్నివిధాలా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి.
సింహ రాశి (Leo):ఈ రాశి వారిలో వివాహం కాని వారికి ఇవాళ పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశివారికి ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలువింటారు. కొన్ని అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి లాభార్జనకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. శరీరానికి విశ్రాంతి చాలా ఆవసరం.
మీన రాశి (Pisces): ఈ రాశి వారికి మంచి సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. గొప్ప సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు అప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి.