వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) మీకున్న స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తారు. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి సంస్థలో చేరతారు. ఆదాయం పరవాలేదు. రుణ బాధ తొలగుతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తి చేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.