మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) దాదాపు అన్ని అంశాల్లోనూ సానుకూల వాతావరణం నెలకొని ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. వ్యాపారంలో ప్రయోజనకర పరిమాణాలు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.
వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగపరంగా కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. ప్రాభవం కాస్తంత తగ్గుతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండొద్దు.
మిథునం(Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగపరంగా అన్ని పనులూ సానుకూలపడతాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు లాభాల పంట పండించుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యంలో పాల్గొంటారు.
కర్కాటకం (Cancer)(పునర్వసు 4. పుష్యమి, ఆశ్లేష) ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. గౌరవ మర్యాదలకు కూడా భంగం ఉండదు. ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు పడతారు. మీకు డబ్బు ఇవ్వాల్నిన వాళ్లు ముఖం చాటేస్తారు. మీరు ఇవ్వాల్సిన వాళ్లు ఒత్తిడి తెస్తారు. బంధుమిత్రుల నుంచే కొద్దిగా సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ
అవకాశాలు కలిసి వస్తాయి.
సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారం నిలకడగా సాగుతుంది.
కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగుల కంటే వృత్తి, వ్యాపారాల వారికే కాస్తంత బాగుంటుంది. లాయర్లు, చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగుల అర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగ జీవితంలో కొద్దిగా సమస్యలు తప్పకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కావు. వ్యాపారులకు లాభాలు వెనుకపట్టు పడతాయి. వైద్య ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో అనుకోని చికాకులు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మాటల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంది.
ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. మంచి పెల్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉ౦ది. కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంటుంది. ధన స్థానంలో గురువు ఉన్నారాశిలో శని ఉండడం వల్ల ఏదీ చేతికి అందదు. శుభ ఫలితాలకు అవకాశం ఉన్నా ఏదీ అనుభవంలోకి రాదు. మధ్య మధ్య ఆరోగ్యం సవాళ్లు విసురుతూ ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగానే గడిచిపోతుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.
కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) వ్యయంలో ఉన్న శని వల్ల ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. చేతిలో డబ్బు ఆడక ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)రాశినాథుడైన గురువు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఎప్పుడు ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తు౦దో తెలియని పరిస్థితి అనుభవానికి వస్తుంటుంది. అనవసర, ఆకస్మిక ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చవుతుంటుంది. తీర్థ యాత్రలకు, మొక్కులు చెల్లించుకోవడానికి మాత్రం సమయం అనుకూలంగా ఉంది. పని ఒత్తిడి ఉంటుంది.