వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) శ్రమ, తిప్పట ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో విశేషమైన ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపార లాభం ఉంది. స్వల్ప ప్రయత్నంతో మంచి విజయాలు సాధిస్తారు. సానుకూల దృకృథంతో వ్యవహరించండి. చెడు ఊహించవద్దు. ఒక గడ్డు సమస్య నుంచి బయటపడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. డబ్బు మోసపోయే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి అవకాశం ఉంది. ఆంతరంగిక విషయాలు ఇతరులతో చర్చించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) సమయం అన్ని విధాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని విజయాలు సాధిస్తారు. ఉద్యోగ సంబంధంగా మంచి అవకాశాలు అందివస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పది మందికీ మేలు జరిగే పనులు తలపెడతారు. చిన్న చిన్న సమస్యలకు, అవరోధాలకు ఆందోళన చెందవద్దు. మీకు అంతా మంచే జరగబోతోంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొత్త ప్రయత్నాలకు వెనుకాడవద్దు. తోటివారి సహాయంతో ముందుకు వెడతారు. కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఓర్పు అవసరం.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) మంచి అలోచనలతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసివస్తుంది. సమయం అనుకూలంగా ఉంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. కొత్తవారి పరిచయాలు లాభాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ధనలాభానికి అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకుండా ఓర్పుతో సంభాషించడం మంచిది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్స్ఫలితాలనిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థికపరంగా అదృష్టం పడుతుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అభినందనలు అందుకుంటారు. వ్యాపార లాభం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. గతంలో మీ మీద పడ్డ నిందలు తొలగుతాయి.