తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు సోమవారం (జనవరి 25, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ మీద బదిలీ చేసే అవకాశం ఉంది. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప్పులు తీరుస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలితో వాదనకు దిగే అవకాశం ఉంది.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం వెనక్కు వెళ్తుంది. స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చులు అవుతాయి.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువు రాకపోకలు ఉంటాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలు బిజీగా ఉండి మిమ్మల్ని కలవలేకపోవచ్చు.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. జీవిత భాగస్వామితో వాదానికి దిగకండి. త్వరలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులు అండదండలు అందిస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. స్నేహితురాలు మీతో సరదాగా కాలక్షేపం చేస్తుంది.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. స్నేహితురాలితో సమయం ఆనందంగా గడుస్తుంది.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితురాలితో అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ లభించే అవకాశం ఉంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం అందుకుంటారు. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. తీర్థయాత్రకు ప్రయత్నాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగం సాఫీగానే సాగిపోతుంది. వివాహ ప్రయత్నం సఫలమవుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతుంది.