కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, మంచి సంస్థలో చేరుతారు. ఆదాయం పెరుగుతుంది. మరో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.