మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థికాంశాలకు అనుకూలమైన సమయం ఇది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, అటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో బాగా లాభాలార్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) మంచి అదృష్ట యోగం ఉంది. ఇంటా బయటా కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఎంతో అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. మీవల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. వ్యాపారులకు చాలా బాగుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ముఖ్య కార్యాలు వాయిదా వేయవలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. అర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) అతి చిన్న ప్రయత్నంతో అతి పెద్ద పనులు పూర్తి చేయగలుగుతారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) కొద్దిపాటి శ్రమ, తిప్పటతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిగా సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హామీలు ఉండొద్దు. విద్యార్భులు శ్రమ పడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో కఠిన లక్ష్యాలను సైతం సునాయాసంగా పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వృత్తులలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో నమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకు౦డా గట్టి నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతోంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) అర్థిక విషయాల్లో కాలం కాస్తంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్ధులకు బాగుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) గతంలో ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్య౦లో పాల్గొంటారు. శుభవార్త వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2) ముఖ్యమైన పనులను శ్రమ మీద పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి నిర్ణయాలను ఆచరణలో పెట్టండి. పేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) అర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్ధులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. ఒక కుటుంబ సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. విద్యార్ధులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు.