వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థిక, వ్యాపార రంగాల వారికి బాగుంది. భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.