Zodiac signs: జ్యోతిష శాస్త్రం ఆధారంగా మనుషుల మనస్తత్వాల్ని చెబుతుంటారు పండితులు. ఐతే... ఆయా రాశుల వారు అచ్చం అలాగే ప్రవర్తిస్తారా అంటే... కచ్చితంగా అవును అని చెప్పలేం. ఎక్కువ మంది ప్రవర్తన మాత్రం తాము చెప్పినట్లే ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహాల కదలికలు ఇతరత్రా అంశాల్ని లెక్కలోకి తీసుకొని మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. కొన్ని రాశుల వారికి గజిబిజి, గందరగోళం ఎక్కువగా ఉంటుంది. వారు చాలా పనులు సరిగా చెయ్యలేరు. ఒక్కోసారి పని అవ్వకపోగా... అది ఇంకా పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఈ రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు చాలా వరకూ బెడిసి కొడుతుంటాయి. ఆ 5 రాశులేవో తెలుసుకుందాం.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిధున రాశి వారు ఏదైనా వేగంగా చేస్తారు. ఎక్కువ సేపు ఒకే పనిని చేయడం వీరికి నచ్చదు. వీరు మాట్లాడుతున్నప్పుడు చేతులు బాగా కదుపుతూ ఉంటారు. వీళ్లతో గొడవ జరిగితే... ఆ కోపంలో అవతలి వ్యక్తిని చేత్తో కొడతారు. లేదంటే... ఏదైనా వస్తువును నేలకేసి కొడతారు. అందువల్ల మిధున రాశి వారితో సఖ్యతగా ఉంటూ... వారికి కోపం రాకుండా చూసుకోవాలి. లేదంటే తర్వాత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) తుల రాశి వారు చాలా జాగ్రత్త పరులు. చేసే పనులు, వ్యవహారాలు చాలా పద్ధతిగా ఉండేలా చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. కానీ చాలా సందర్భాల్లో పనులు పద్ధతిగా జరగవు. ఏదో ఒక తేడా వస్తుంది. వీరు కూడా ఆవేశం వచ్చినప్పుడు అవతలి వారిపై చేయి చేసుకోవడానికీ, వస్తువుల్ని విసిరి కొట్టడానికి వెనకాడరు. అయితే పరిస్థితి అక్కడి దాకా రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ధనస్సు రాశి వారికి తరచూ చిరాకు, కోపం, అహసనం వంటివి వస్తూ ఉంటాయి. ఇందుకు కారణం వారి చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ వారికి చికాకు తెప్పిస్తూనే ఉంటాయి. దాంతో కంట్రోల్ తప్పుతూ ఉంటారు. వస్తువుల్ని విసిరేసే గుణం వీరిలోనూ ఉంది. రోజు వారీ పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి విసురుతారు. లేదంటే... పక్కకు బలంగా నెట్టుతారు. అయితే... ఇలా చేసినప్పుడల్లా నష్టం జరుగుతుందని అనుకోవాల్సిన పనిలేదు.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) కుంభ రాశి వారు... మీన రాశి వారి లాగే... వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. ఊహల్లో కాకుండా వాస్తవంలో జీవిస్తూ... ఏదైనా పని చేయడానికి టైమ్ కేటాయిస్తూ ఉంటారు. ఐతే... వీరు ఎంచుకునే పనులు అంత ఈజీగా పూర్తవవు. అవి వీరిలో సహనాన్ని పరీక్షిస్తాయి. కోపం, ఆవేశం తెప్పిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోతే... వీరికి బాగా కోపం వస్తుంది. అలాంటి సందర్భంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) మీన రాశి వారికి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఏదీ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. సమస్యేంటంటే... వీరు గందరగోళ వాతావరణంలోనే పనిచేస్తూ ఉంటారు. అందువల్లే ఏదీ సరిగా పూర్తి కాదు. అయినప్పటికీ మాగ్జిమం సరిచెయ్యడానికి ట్రై చేస్తారు. ఏం చేసైనా పనులను పద్ధతిగా పూర్తి చెయ్యాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది వీలవుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.