సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) సింహ రాశి వారు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. వారి భావవ్యక్తీకరణ, నటనతో అవతలి వారిని సులభంగా ఆకర్షించగలరు. అంతేకాదు, తమ ప్రియమైన వారి పట్ల అన్ని సమయాల్లో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ వ్యక్తులు ఇతరులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విజయవంతమవుతారు. మిగతావారంతా వీరిలా ఉండాలనీ, అలా ఉంటే బాగుంటుందని అనుకుంటారు.