మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.(ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. ఆటంకాలు, అవరోధాలు ఉన్నా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దగ్గరి బంధువులతో తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఉద్యోగంలో ముఖ్యమైన లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కూడా చాలావరకు కుదుటపడుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే అన్నీ మీకు సానుకూలమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా మధ్య మధ్య ఒత్తిళ్ళు తప్పవు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువులలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోంది. అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఉద్యోగంలోహోదా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. పెళ్లి సంబంధం ఆలస్యం అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఉద్యోగంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్టితి బాగా మెరుగుపడుతుంది. మిత్రులకు ఆర్థికంగా సహాయం చెస్తారు. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం. బంధువుల ద్వారా లాభపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. ఉద్యోగపరంగా పురోగతి కనిపిస్తోంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా చూసుకోండి, వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఆటంకాలను లెక్క చేయకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇంటా బయటా పనుల ఒత్తిడి ఉంటుంది. జీవితానికి సంబంధించి కొన్ని మంచి నిర్షయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువులు అపనిందలు వేస్తారు. సరిగ్గా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్టితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మధ్య మధ్య కుటుంబ సభ్యులతో సంప్రదించండి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)