Horoscope today : రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మార్చి 29, 2023 బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries) : విధి నిర్వహణ మీద శ్రద్ధ పెంచండి. కుటుంబ వాతావరణం, ఆఫీసు వాతావరణం ప్రశాంతంగా సాగిపోతాయి. పొరపాటున కూడా మీ బలాలు, బలహీనతల గురించి ఇతరులకు చెప్పవద్దు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. లాభాలు గడిస్తారు. డబ్బులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం మంచిది.
వృషభ రాశి (Taurus) : పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను పూర్తిచేస్తారు. ప్రతిభకు చక్కని గుర్తింపు లభిస్తుంది. ఆదాయపరంగా బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మిథున రాశి (Gemini) : కొద్ది ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారుల ఆదరణ సంపాదించుకుంటారు. సహచరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఐటి రంగానికి చెందినవారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెల కొంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుడికి దండం పెట్టుకోవడం మంచిది.
కర్కాటక రాశి (Cancer) : ఈ రాశి వారికి రోజంతా సాఫీగా గడిచిపోతుంది, ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. పొదుపు సూత్రాలపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. దుర్గాదేవికి పూజ చేయించడం వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
సింహ రాశి (Leo) : కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆదాయపరంగా సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. ఒక ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభిస్తే విజయం సొంతం అవుతుంది. ఇతరుల మాటలు నమ్మి పక్కదారి పట్టవద్దు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వినాయకుడికి పూజ చేయడం మంచిది.
కన్య రాశి (Virgo) : ఈ రాశి వారికి ఒక చిన్న పాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న బాకీ ఒకటి అనుకోకుండా చేతికి వస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ఉదయం శివుడిని ధ్యానించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పాజిటివ్‌గా ఆలోచించడం మంచిది.
తుల రాశి (Libra): మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. డబ్బుకు కొద్దిగా కటకట ఏర్పడుతుంది. గతంలో మీ నుంచి సeయం పొందిన వారు ఇప్పుడు అవసర సమయంలో ముఖం చాటేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తరచూ దత్తాత్రేయ స్వామిని మనసులో స్మరించుకోండి.
వృశ్చిక రాశి (Scorpio) : కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపుతప్పి ఇబ్బంది పడతారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. మొండి బాకీ ఒకటి వసూలు అయ్యే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవడం చాలా మంచిది.
ధనస్సు రాశి (Sagittarius) : ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. అనుకోకుండా స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దుర్గాదేవిని స్తుతించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మకర రాశి (Capricorn) : శారీరక మానసిక శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మిత్రుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులు శ్రమ మీద ఉత్తీర్ణత సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. ఆదిత్య హృదయం చదువు కోవడం చాలా మంచిది.
కుంభ రాశి (Aquarius) : ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఉద్యోగ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. శివార్చన చేయించడం చాలా మంచిది.
మీన రాశి (Pisces) : ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఎంతో శ్రద్ధగా విధులను నిర్వర్తిస్తారు. సహచరులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. తరచూ లలితా సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది.