మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 )
ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకోకుండా ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాలతో గడువుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా కొన్ని మంచి వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన పనుల్లో బాగా శ్రద్ధ పెంచాలి. అనుకూలమైన సమయం ఇది. ప్రయత్నాల్లో అరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఆలోచనలను దగ్గరికి రానివ్వొద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 )
ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్రమ అవసరం. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబపరంగా సమస్యలున్నా ధైర్యం ఎదుర్కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ, అనూరాధ, జేష్ట్య)
ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో సమర్థవంతంగా పని చేస్తారు. అవసరాలకు సరిపడ డబ్బు చేతికి అందుతుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించేవారితో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సంతృప్తికర స్థాయిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుమిత్రుల సహాయంతో ఓ వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యంలో విషయంలో జాగ్రత్త.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓ కుటుంబ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం ఫర్వాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆస్తికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుల్లో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అన్నింటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో మాత్రం కాస్తంత జాగ్రత్త అవసరం. అనుకున్న పెల్లి సంబంధం ఖాయమవుతుంది.