Horoscope today : రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 26, 2023 శుక్రవారం)... రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries) : కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.
వృషభ రాశి (Taurus) : కుటుంబ సమస్య ఒకటి చక్కబడుతుంది. కుటుంబపరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం అంత మంచిది కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారతాయి.
మిథున రాశి (Gemini) : కొత్త ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయపరంగా, సంపాదనపరంగా మరో అడుగు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం రొటీన్‌గా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer) : ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా ముందుకు వెళుతుంది.
సింహ రాశి (Leo) : ఒక ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించు కుంటారు. ఆర్థిక ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాల్లో బంధువులకు లేదా మిత్రులకు వాగ్దానం చేయకపోవడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంగా సాగుతాయి.
కన్య రాశి (Virgo) : నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. సంపాదన ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కుటుంబంలో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
తుల రాశి (Libra) : నిరుద్యోగు లకు విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితా లను ఇస్తాయి. సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే చక్కబడతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో చాలావరకు ముందుకు వెళతారు.
వృశ్చిక రాశి (Scorpio) : ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయ త్నాలు ప్రారంభిస్తారు. అయితే, ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. విద్యా ర్థులు గట్టి ప్రయత్నం మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్ధాలు తలెత్తుతాయి.
ధనస్సు రాశి (Sagittarius) : నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ అందే సూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.
మకర రాశి (Capricorn) : ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా కూడా కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరులకు వాగ్దానాలు చేయటం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius) : కొన్ని ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.
మీన రాశి (Pisces) : ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి బంధువుల సహాయంతో పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి కుటుంబ సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఒక ముఖ్యమైన సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.