Love Marriage Zodiac Signs: కొంత మందికి పెద్దలు కుదిర్చే పెళ్లి నచ్చుతుంది. కొంత మందికి ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నచ్చుతుంది. అందరి మనస్తత్వాలూ ఒకేలా ఉండకపోవడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ పెళ్లి అనేది కూడా ఇలా కోరుకోగానే అలా అయిపోయే సందర్భాలు తక్కువనీ... పెళ్లికి అనుకూలమైన గ్రహ బలాలు, ముహూర్తాలు ఇలా ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. సహజంగా పెద్దవాళ్లు ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు. యువతేమో... ప్రేమ పెళ్లే చేసుకుంటామంటుంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో వధూ వరులకు ముందుగా పరిచయం ఉండదు. అదే లవ్ మ్యారేజ్ అయితే... ఆల్రెడీ తెలిసిన భాగస్వామే కాబట్టి ఎలాంటి సమస్యలూ రావంటారు కొందరు. మరి ఏ రాశి వారు ప్రేమ వివాహాల్ని ఇష్టపడతారో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) మేష రాశి వారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వీరు తాము ప్రేమించేవారిని పూర్తిగా నమ్ముతారు. ఇతరులతో తమ సత్సంబంధానికి వారు ఎంతో విలువ ఇస్తారు. ఈ సత్సంబంధాలను కొనసాగించేందుకు వీరు ఎంతైనా కష్టపడతారు. వీళ్లు తమ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ సర్కిల్లో వారితోనూ ప్రేమలో పడతారు. వీళ్లు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించరు. అందువల్ల వీరితో ప్రేమ వివాహం చాలా ఆనందంగా సాగిపోతుందని అనుకోవచ్చంటున్నారు పండితులు.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృషభ రాశి వారు చాలా నిబద్ధతతో ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. వీరు ప్రేమించే విషయంలో... వెతికి వెతికి మరీ ప్రేమిస్తారు. ప్రేమించడం మొదలుపెడితే... చాలా లోతుగా ప్రేమిస్తారు. కానీ... ఆ విషయాన్ని అస్సలు చెప్పరు. పెళ్లి చేసుకోవాలని ఉన్నా సైలెంట్‌గా ఉంటారు. ఈ ప్రేమను ఎవరైనా కనిపెట్టి... ముందుకు నెట్టాలి. అయినా సరే ముందడుగు వేస్తారనే గ్యారెంటీ ఉండదు. ఐతే... ఎప్పుడో కప్పుడు బయటకు వస్తారు. మనసులో మాటను చెబుతారు. దానికి టైమ్ తీసుకుంటారు. మొత్తానికి ప్రేమ పెళ్లికే ఇష్టపడతారు. తమ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం వృషభ రాశి వారికి అంతగా నచ్చదు. అందువల్ల వీరు బయటపడేవరకూ అవతలి వారు వెయిట్ చెయ్యాల్సిందే.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిధున రాశి వారు అస్సలు సైలెంట్‌గా ఉండరు. చాలా చెలాకీగా, చురుకుగా, డైనమిక్‌గా... ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు. అందరితోనూ కలిసిపోతారు. ఫలితంగా అందరూ వీళ్లను ప్రేమిస్తారు. ఐతే ఇక్కడో సమస్య ఉంది. మిధున రాశి వారు ఎప్పుడూ ఒకే ఫ్రెండ్స్‌తో ఫిక్స్‌గా ఉండరు. ఎందుకంటే వీళ్లకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా వదిలేయడానికి కూడా వీరు పెద్దగా ఆలోచించరు. చిత్రమేంటంటే... ఇలాంటి వీరు... ప్రేమ, పెళ్లి విషయంలో మాత్రం చాలా కచ్చితంగా ఉంటారు. సరైన వాళ్లను ఎంచుకొని... వాళ్లనే పెళ్లి కూడా చేసుకుంటారు. ఎలాంటి వాళ్లను ప్రేమిస్తారంటే... వీళ్ల అల్లరి, చిలిపితనం అన్నీ భరించే వాళ్లను పెళ్లి చేసుకుంటారు. అందువల్ల మిధున రాశి వారు... పెద్దలు చూసిన వివాహాలు, తెలియని వారిని పెళ్లి చేసుకోవడాలు వంటివి చాలా వరకూ జరగవు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ధనస్సు రాశి వారు మరో రకం. వీరు వీళ్ల జీవితాన్ని ఓ పద్ధతిలో ఉంచుకుంటారు. తాము ఎలా ఉండాలని కోరుకుంటారో అలాగే ఉంటారు. ప్రేమ, పెళ్లి విషయంలోనూ అంతే. సినిమాల్లో చూపించినట్లు చూడగానే ప్రేమలో పడిపోవడం వీళ్ల దగ్గర జరగదు. ఎవర్ని ప్రేమించాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి... అన్నీ సిస్టమేటిక్ వేలో ఆలోచించుకుంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని ఈ రాశి వారు ఏదో ఒక రకంగా ఆపేస్తారు. మాగ్జిమం అలా ట్రైచేస్తారు. ఎందుకంటే... ఆ పెళ్లి తన కంట్రోల్ ప్రకారం లేదనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్లు చాలా పర్ఫెక్టు ప్లాన్‌తో ఉంటారు కాబట్టి ఇతరులు వీళ్లను తప్పు పట్టలేరు. చివరకు ఏదో ఒక రోజున ప్రేమలో పడి... పెళ్లి కూడా చేసుకుంటారు. ఈ రాశి వారు ఒక్కసారి ఎవర్నైనా ప్రేమిస్తే... ఇక వారినే చేసుకుంటారు. ఎవరు వద్దన్నా, కాదన్నా, ఏం జరిగినా సరే... తమ నిర్ణయం మార్చుకోరు.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) మకర రాశి వారు ప్రేమించడం కంటే... ప్రేమను పొందడమే ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎవరైనా ప్రేమించారంటే చాలు... అంతే... ఇక జీవితాంతం వారిని రివర్స్ ప్రేమిస్తూనే ఉంటారు. అలా ఫిక్స్ అయిపోతారు. చిన్నప్పుడు ఎవరైనా తెలిసిన వారు... ఇప్పుడు మళ్లీ పెద్దయ్యాక కలిసి... ప్రేమిస్తున్నట్లు చెబితే... ఇంకేమీ ఆలోచించరు... వెంటనే ప్రేమను ఒప్పేసుకుంటారు. పెళ్లి కూడా అయిపోతుంది. అంతా బాగానే ఉన్నా... పెద్దలు కుదిర్చే పెళ్లి వీళ్లకు అంతగా నచ్చదు. ప్రేమ వివాహాలంటేనే వీళ్లకు ఇష్టం. అలా జరిగితేనే... తమ ఇష్ట ప్రకారం పెళ్లి జరిగిందనే భావనతో ఉంటారు. అందువల్ల మకర రాశి వారి పెళ్లి విషయంలో పెద్దలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు పండితులు.