మిథున రాశి వారు చదువులో చాలా తెలివిగా ఉంటారు. విద్యావిషయాల్లో ఎక్కువ ర్యాంకులు సాధిస్తారు. కాకపోతే వీరు పోటీల్లో గెలవడం చాలా కష్టం. కారణం ఒకేదానిపై ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేరు. ఈ రాశి వారు స్వతహాగా చాలా దయగలవారు. వీరికి గణేశుడి అండదండలు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతిరోజూ వినాయకుడిని పూజించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.