ఈ ప్రేమ వివాహానికి జ్యోతిషపరంగా ఎలాంటి యోగాలు, సంయోగాలు ఉంటాయన్నది నిజంగా ఆసక్తికర చర్చ. జ్యోతిషం పూర్తిగా విధి రాత మీద ఆధారపడిన శాస్త్రమే అయినప్పటికీ, దేశ కాల పరిస్థితును బట్టి అన్వయం చేసి జోస్యం చెప్పాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో జ్యోతిష శాస్త్రవేత్తలు ప్రేమ వివాహాల మీద ప్రత్యేక అధ్యయనం చేసి అత్యుత్తమమైన గ్రంథాలు తెస్తున్నారు. ఈ అధ్యయనాలు, పరిశోధనలను బట్టి జాతక చక్రంలో ప్రేమ వివాహాలకు ఉన్న యోగాలను, అవకాశాలను అంచనా వేయవచ్చు.
యువతీ యువకుల మధ్య ప్రేమ అంకురించడానికి ప్రధాన కారకుడు శుక్రుడు (Venus Planet). ఒకరకంగా శుక్రుడు మన్మథుడు లాంటివాడు. సాంప్రదాయ విధానాలకు, సమాజం అంగీకరించిన విధానాలకు రాహు, శని (Saturn Planet) పూర్తిగా వ్యతిరేకులు. ఈ రెండు గ్రహాల స్థితిగతులను బట్టి జాతకుడు సంప్రదాయాలను ఎంతవరకు, ఏ కోణంలో వ్యతిరేకిస్తాడో చెప్పవచ్చు.
ఇక ఇతర గ్రహా స్థితిగతులు కూడా ప్రేమ వివాహానికి కొంతవరకు దోహదం చేస్తాయి. సప్తమాధిపతి పంచమంలో ఉన్నా, పంచమాధిపతి సప్తమంలో ఉన్నా, ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నా, సప్తమాధిపతి ద్వితీయంలోఉన్నా... ప్రేమ వివాహం తప్పదని శాస్త్రం చెబుతోంది. విగ్నాధిపతి సప్తమంలో ఉన్నా, సప్తమాధిపతి విగ్నంలో ఉన్నా... ప్రేమ వివాహం జరుగుతుందని భావించాలి.
జాతకంలో గురువు (Jupiter), బుధుడు (Mercury), చంద్రుడి (Moon) ప్రభావం ఎక్కువగా ఉన్న పక్షంలో పెద్దల అనుమతితో, పెద్ద సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. గురువు (Jupiter) ప్రభావం ఉన్నట్టయితే, గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాకులాడుతారు. సమాజంలో గౌరవ మర్యాద ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతారు. వారి ప్రేమ హుందాగా ఉంటుంది.
కుజ (Mars), రాహు, కేతువు ప్రభావం పడినప్పుడు ఆ ప్రేమ హుందాగా, సమాజం మెచ్చేదిగా ఉండదు. లైంగిక సంబంధమే వారి ప్రధాన ధ్యేయమవుతుంది. కామోద్రేకంతోనే అటువంటి వారు ప్రేమలో పడతారు. లైంగిక సంబంధానికి, సహజీవనానికి వారు ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి కూడా ఈ గ్రహాలు దోహదం చేస్తాయి.