Horoscope : జీవితానికి డబ్బు ప్రధానం. అది ఉంటేనే ముందడుగు వెయ్యగలం. మనీ లేకపోతే అన్నీ కష్టాలే.. ఇలా చాలా మంది భావిస్తారు. కొందరు మాత్రం డబ్బును చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏయే రాశుల వారు డబ్బును ప్రేమిస్తారో, ఎందుకో జ్యోతిష పండితులు తెలిపారు. నాలుగు రాశుల వారిలో డబ్బుకి సంబంధించి ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటంటే.. వాళ్లు వృథాగా డబ్బు ఖర్చు పెట్టరు. వాళ్లకు తెలివితేటలు ఎక్కువ. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆ రాశులేవో తెలుసుకుందాం.
మకరం (Capricorn) : మకర రాశి వారు హార్డ్ వర్కర్స్. పని రాక్షసులుగా గుర్తింపు పొందుతారు. ఈ రాశి వారు ప్రతి రూపాయినీ ప్రేమిస్తారు. ఏ రోజు ఎంత సంపాదిస్తున్నదీ, ఎంత ఆదాయం తమ దగ్గర ఉన్నదీ కచ్చితమైన లెక్కలు వేసుకుంటారు. బాగా చేస్తారు. వృథాగా ఒక్క రూపాయీ ఖర్చు పెట్టరు. వీళ్లు కొనే వస్తువు ఏదైనా సరే.. తక్కువ ఖర్చు... ఎక్కువ ప్రయోజనం ఫార్ములాతో ఉంటుంది. గొప్ప విషయమేంటంటే.. వీళ్లతో ఉండే వాళ్లకు ఆర్థిక సమస్యలు పెద్దగా రావు. అలా రానివ్వకుండా వీళ్లు మంచి సలహాలు ఇస్తుంటారు.
కన్య (Virgo) : కన్యా రాశి వారిని డబ్బు విషయంలో పర్ఫెక్షనిస్టులు అంటుంటారు. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు ఎలాంటి వైనా సరే.. వీళ్లు చాలా పర్ఫెక్టుగా ఫినిష్ చేస్తారు. వీళ్లు కూడా బాగా కష్టపడతారు. ఆర్థిక విషయాల్లో వీళ్లను ఎవరైనా నమ్మితే.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఐతే... వీళ్లు చేసే ప్రతి పనిలోనూ నాకేంటి అన్న యాంగిల్ ఉంటుంది. ఊరికే ఏదీ చెయ్యరు. ప్రతిఫలం కచ్చితంగా ఆశిస్తారు. అవతలి వారు కూడా వీరి పనితనం చూసి.. కచ్చితంగా ప్రతిఫలం ఇవ్వడానికే ఇష్టపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కన్యా రాశి వారు మనీ విషయాల్లో ప్రొఫెషనల్స్లా వ్యవహరిస్తారు. డబ్బు రాదనుకుంటే ఏ పనీ చెయ్యరు, ఏ డీలూ కుదుర్చుకోరు.
వృషభం (Taurus) : వృషభ రాశి వారు నేల విడిచి సాము చెయ్యరు. ఊహల్లో విహరించరు. అదృష్టవశాత్తూ డబ్బు వస్తుందని అస్సలు అనుకోరు, అలాంటివి ఆశించరు. భారీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వీరికి బాగా ఉంటుంది. దానికి తోడు వీరికి కనిపించే వస్తువుల్లో ఏది బడితే అది నచ్చదు. కచ్చితంగా ఎక్కువ డబ్బుతో కొనాల్సినవే వీరికి నచ్చుతాయి. కావాలని అలాంటివి ఎంచుకోరు.. వారి మనసులోనే అలాంటి ఆలోచనలు ఉంటాయి. లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వీరు.. అందుకు తగ్గట్టుగానే కంటిన్యూగా డబ్బు సంపాదించాలి ఆనే టార్గెట్తో ఉంటారు. అడ్డగోలుగా వచ్చే వాటిని వీరు ఆశించరు. కష్టపడి సంపాదించి, కొనుక్కోవడానికే ఇష్టపడతారు. వీరి దగ్గగ వేల కోట్లు ఉన్నా సరే... ఇంకా సంపాదించాలనే టార్గెట్ ఉండి తీరుతుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారు పైకి ఎంత సునిశిత దృష్టితో ఉంటారో.. లోపల అంత కంటే ఎక్కువ సామర్ధ్యంతో ఉంటారు. అంటే డబ్బు సంపాదించాలనే ఆలోచన మనసులో చాలా బలంగా ఉంటుంది. అందుకోసం వీరు చాలా ప్రొఫెషనల్ దారిలో వెళ్తారు. వీళ్లకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే.. వీళ్లు దేన్నైనా గురి పెడితే... అది సాధించేదాకా వదలరు. సహజంగానే వీరికి డబ్బు సంపాదించాలనే టార్గెట్ ఉంటుంది. అది వెంటనే నెరవేరకపోయినా.. టార్గెట్ దిశగా పయనిస్తూనే ఉంటారు. సమస్యేంటంటే... డబ్బు అనేది ఎంత సంపాదించినా తీరని టార్గెట్ కావడం వల్ల.. వీరు జీవితాంతం ఈ టార్గెట్ వైపు వెళ్తూనే ఉంటారు. తమ జీవితం ఇలా ఉండాలి అని వీరు ఫిక్స్ అవుతారు. అందుకోసం డబ్బు సంపాదించాలని గట్టిగా ప్రయత్నిస్తారు.