ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి మనిషితో స్నేహం చేయడం వీలు కాదు. పరిస్థితుల ప్రభావంతో కొందరు శత్రువులు అవుతారు. కొందరు తెలిసి చేసిన పనులతో శత్రువులుగా మారితే.. మరి కొందరు తెలియకుండానే వ్యతిరేక పక్షంలో చేరుతారు. కొందరు శత్రువులు కొంత కాలానికి కోపం మర్చిపోతారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వారికి రాదు. గొడవలను సాధారణంగా తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ కొన్ని రాశులకు చెందిన వారితో మాత్రం శత్రుత్వం పెట్టుకోవడం మంచిదికాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వీరు మనసులో పగ పెంచుకుంటారని, టార్గెట్ చేసిన వారిని అంత సులువుగా విడిచిపెట్టరని చెబుతున్నారు. ఆ రాశులకు చెందిన వారితో వీలైనంత మేరకు గొడవలు పెట్టుకోకపోవడమే మంచిదంటున్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న రాశులు ఏవో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారు కోపంగా ఉంటే ఎదుటివారిపై భావోద్వేగాల సుడిగుండాలను విసురుతారు. వారికి శత్రువుగా మారుతారు. వారు అన్నింటినీ ఎదుటివారిపైకి విసిరేయరు. ఎదుటివారి గురించి గాసిప్లను కూడా వ్యాప్తి చేస్తారు. వారి మాటలు విషపూరితమైనవి.. వారితో శత్రుత్వం పెట్టుకున్న వారు చింతిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (Taurus): ఈ రాశిచక్రానికి చెందిన వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు. వీరికి కోపం తెప్పించే పని చేయకూడదు. ఏదైనా విషయం వారికి కోపాన్ని కలిగిస్తుందని తెలిసినప్పుడు ఆ అంశాలను ప్రస్తావించకండి. శత్రువుగా వారు మిమ్మల్ని చిన్న నవ్వుతో పలకరిస్తారు. ఇద్దరి మధ్య ఉన్న టెన్షన్‌ని వారు ఎప్పటికీ గుర్తించరు. ఇది ఎదుటివారు వారి సొంత కోపంతో మల్లగుల్లాలు పడేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారి కోపం కలవరపెడుతుంది, భయపెడుతుంది. వారు నటించరు. ఎదుటివారి కళ్లలోకి, ప్రజల మధ్యలో వారిని శత్రువులా చూస్తారు. అంత తేలికగా వదిలిపెట్టరు. వారి నిర్ణయాలు వేగంగా, సమయానుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు శత్రువులపై ఎప్పుడు కౌంటర్ ఎటాక్ చేస్తారో ఊహించలేరని గుర్తుంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)