వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి చెందినవారు విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడతారు. భౌతిక ఆనందాలను ఆస్వాదిస్తారు. చాలా డబ్బు ఖర్చు చేయడం వల్ల వారి వద్ద పెద్దగా డబ్బు మిగలదు. వారు ఏదైనా కొనాలని అనుకుంటే.. వెంటనే కొనుగోలు చేస్తారు. వెనకా ముందు చూడదరు. బడ్జెట్ గురించి ఆలోచించరు. అందుకే వారి వద్ద డబ్బులు మిగలవు. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (Gemini): ఈ రాశి వారు తమ స్నేహితుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. తాము గొప్పవారమని చెప్పుకునేందుకు.. డబ్బు మొత్తం ఖర్చు చేస్తారు. తద్వారా పొదుపు చేయలేకపోతున్నారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అందుకే మిథున రాశి వారు తమ తెలివితేటలతో చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ ఖర్చు ఎక్కువగా పెట్టడం వల్ల డబ్బును ఎక్కువగా ఆదా చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశుల వారిపై సూర్యదేవుడి అనుగ్రహం ఉంటుంది. వీరు విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడతారు. ఇది మాత్రమే కాదు. హాబీలు కూడా చాలా రాయల్‌గా ఉంటాయి. ఈ వ్యక్తులు తమ సౌలభ్యం, సౌకర్యాల కోసం డబ్బును నీటిలా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులు కొనడం వల్ల డబ్బు పొదుపు చేయలేకపోతారు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): తులా రాశికి శుక్రుడు అధిపతి. అందుకే వారికి విశేషమైన సంపద వస్తుంది. కానీ డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. తమ కంటే ఇతరులపైనే ఎక్కువగా ఖర్చుపెడతారు. అందుకే ఈ వ్యక్తులు డబ్బును పొదుపు చేసుకోలేకపోతున్నారు. వీరు ప్రస్తుతాన్ని మాత్రమే నమ్ముతారు.ఇప్పుడు బాగుంటే చాలనుకుంటారు. భవిష్యత్తు గురించి అస్సలు పట్టించుకోరు. (ప్రతీకాత్మక చిత్రం)