ధనస్సు (Sagittarius): ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కృషి సత్ఫలితాలనిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం నుంచి చక్కని శుభవార్తలు వింటారు.