భారతీయ సంప్రదాయంలో హోలీ పండగ చాలా ప్రాచీనమైనది. వసంత రుతువుకు స్వాగతం చెబుతూ ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పర్వదినమిది. ఈ వేడుకకు ఎన్నో పేర్లు, మరెన్నో పరమార్థాలు ఉన్నాయి. ఇక, హోలీకి ఎనిమిది రోజుల ముందు హోలాష్టకం ప్రారంభమవుతుంది. హోలాష్టకం ఫిబ్రవరి 27 ప్రారంభమైంది. ఇక,హోలాష్టకం నుంచి హోలీ వరకు ఎవర్ని పూజించాలి.. పూజా విధానాలు గురించి తెలుసుకుందాం.
నరసింహ స్వామి పూజా విధానం : నరసింహా స్వామి పూజ కోసం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు చందనం లేదా కుంకుమ తిలకం రాయండి. స్వచ్ఛమైన నీటి తర్వాత పాలలో పసుపు లేదా కుంకుమ కలిపి అభిషేకం చేయాలి. ఆ తర్వాత పసుపు చందనాన్ని దేవుడికి సమర్పించాలి. ఆ తర్వాత కుంకుమ, అక్షత, పసుపు పూలు,పసుపు వస్త్రాలు సమర్పించాలి. ఆ తర్వాత పండ్లు సమర్పించి.. ధూప, దీప దర్శనంతో కొబ్బరికాయలు సమర్పించి హారతి సమర్పించాలి.