HOLI 2022 USE THESE COLORS ONLY ACCORDING TO YOU ZODIAC SIGN THEN YOU WILL GET GOOD LUCK AND HAPPINESS SK
Holi 2022: హోలీలో ఏ రాశి వారు ఏ రంగును వాడాలి..? అలా చేస్తే అంతా అదృష్టమే
Holi 2022 | Zodiac Signs: దేశమంతటా హోలీ సందడి నెలకొంది. ఉత్తరాదిన హోలికా దహనం కార్యక్రమం ఇవాళ జరగనుంది. రేపు హోలీని కలర్ఫుల్గా జరుపుకునేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐతే జ్యోతిషశాస్త్రం ప్రకారం.. తమ రాశులకు అనువైన రంగులను హోలీలో వాడితే మంచి జరుగుతుందట. అదృష్టం కలిసి వస్తుందట. మరి ఏ రాశుల వారు ఏ రంగుల వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్యంలో రంగులకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాశి చక్రంలో మొత్తం 12 రాశులకు వారి స్వంత గ్రహాలు, వారికి ఇష్టమైన రంగులను కలిగి ఉంటాయి. మీ పాలిత గ్రహానికి ఇష్టమైన రంగులతో హోలీ ఆడితే.. మీకు అదృష్టం కలిసి వస్తుంది. హోలీ వేళ మరింత సుఖ సంతోషాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
మేషం-వృశ్చికం: ఈ రాశుల వారు ఎరుపు రంగు గులాల్‌తో హోలీ ఆడాలి, ఎందుకంటే ఈ రెండు రాశుల అధిపతి అంగారకుడు. వీరు ఎరుపు రంగుతో హోలీ ఆడితే మంచి జరుగుతుంది. పింక్ కలర్ మీకు కూడా మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
వృషభం-తుల: వృషభం , తుల రాశి వారు గులాబీ, వెండి రంగు గులాల్‌తో హోలీ ఆడాలి. ఈ రాశుల వారి అధిపతి శుక్ర గ్రహం. శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
కన్య-మిధునం: ఈ రెండు రాశులకు అధిపతి బుధ గ్రహం. కన్య, మిథున రాశి వారు హోలీలో ఆకుపచ్చ రంగును వాడితే అదృష్టం కలిసివస్తుంది. నారింజ రంగు వాడినా పరవాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
మకరం-కుంభం: ఈ రెండు రాశుల వారు హోలీలో నీలం రంగును ఉపయోగించాలి. వీరిని పాలించే గ్రహం శనిదేవుడు. అందుకే నీలం రంగును వాడితే శుభం కలుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ధనుస్సు-మీనం: ఈ రాశుల వారు పసుపు, నారింజ రంగులతో హోలీ ఆడాలి. ధనస్సు, మీన రాశుల పాలక గ్రహం బృహస్పతి. గురుడికి కలిసి వచ్చే రంగు పసుపు. అందుకే వీరు పసపు రంగుతో హోలీతో ఆడితే మేలు జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
కర్కాటకం: మీ రాశిచక్రాన్ని పాలించే గ్రహం చంద్రుడు. చంద్రుడు తెల్లగా ప్రకాశంతంగా మెరుస్తాడు. అందుకే వీరు సిల్వర్ కలర్‌తో హోలీ ఆడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
సింహం: ఈ రాశిని పాలించే గ్రహం సూర్యుడు. వీరు నారింజ, ఎరుపు రంగులతో హోలీ ఆడాలి. పసుపు రంగు కూడా మంచిదే. సూర్యుడు ఎర్రగా.. సాయంత్రం వేళ..నారింజ రంగులోనూ కనిపిస్తాడు. అందుకే సింహరాశి వారి ఈ రంగులతో హోలీ ఆడాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )ప్రతీకాత్మక చిత్రం