ప్రజలు తమ జీవిత భాగస్వామితో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దగ్గర కావాలి. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే వివాహ బంధాలు ఎంతో కాలం మనుగడ సాగించలేవు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతో పాటు ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండాలి. సాధారణంగా విడిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు వివాహ బంధంలో తగాదాలు మొదలవుతుంటాయి. సరిగ్గా ఇలాంటప్పుడే రిలేషన్‌షిప్‌పై తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
* వృశ్చిక రాశి : తమ స్వతంత్రానికి విలువనిచ్చే వృశ్చిక రాశి వారు తమ భాగస్వామితో సరిగా ఉండలేరు. భాగస్వామి చూడగానే వారికి వెంటనే చిరాకు వేస్తుంది. ఇలా చిరాకు పడటం వల్ల వారి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వృశ్చిక రాశి వారు వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని అనుకుంటుంటారు. కానీ భాగస్వామి లేని ఒంటరి జీవితాన్ని ఊహించుకుంటేనే వారికి భయమేస్తుంది. అందుకే వారు సమస్యలు ఉన్నా సరే వైవాహిక జీవితాన్ని సాగిస్తుంటారు. ఎందుకంటే వారు సంతోషంగా లేకపోయినా ఆ జీవితం వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. వారు తమ భాగస్వామితో తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపరు.
* సింహ రాశి : సింహరాశి వారు తమ వివాహ బంధం నుంచి విడిపోతున్నట్లు పదే పదే కలలు కంటూ ఉంటే.. అది వారి భాగస్వామితో సమస్యలు ఉన్నాయనే దానికి సంకేతం కావచ్చు. ఈ రాశి వారు సంతోషంగా లేకపోయినా, తమ భాగస్వామికే అంటిపెట్టుకొని ఉండొచ్చు. వివాహ బంధంలో ఎన్ని సమస్యలున్నా వారు దాని నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ఆసక్తిని చూపించరు. తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని కూడా వారు అంగీకరించరు. థెరపిస్ట్ నుంచి సహాయం తీసుకునే ఆలోచన చేయరు. వివాహాన్ని చక్కదిద్దుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా భాగస్వామిని ఎన్నడూ అడగరు.
* కర్కాటక రాశి : సున్నిత మనస్కులైన కర్కాటక రాశి వారు తమ భాగస్వామితో గొడవలు పెట్టుకుంటున్నప్పుడు మాటలను చాలా జాగ్రత్తగా వింటారు. వాటిలో వ్యంగ్యం, అగౌరవ వ్యాఖ్యలను కూడా గమనిస్తారు. సాధారణంగా భాగస్వామి కొంచెం హేళన చేసినా, అగౌరవపరిచినా ఫర్వాలేదు కానీ ఎక్కువగా జరిగితే మాత్రం అది వైవాహ జీవితంలో సమస్యలు ఉన్నాయనడానికి సంకేతం. భాగస్వామి అగౌరవపరిచినప్పుడు, కర్కాటక రాశి వారు బాధపడతారు. కానీ వారు వివాహ జీవితాన్ని సరిదిద్దడానికి ఎలాంటి ముందడుగు వేయరు.
* కన్య రాశి : కన్య రాశి వారు తమ జీవిత భాగస్వామితో చాలా వాదనలు ఉన్నా, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. దానికి ఈ రాశి వారు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని గ్రహిస్తారు. అయితే భాగస్వామితో విషయాలు ఏం బాగోలేదని తెలిసినా, తమ వివాహం సమస్యల్లో ఉందని వారు అంగీకరించరు. వారు తమ బంధం సమస్యలో ఉందనే సంకేతాలను అసలు పట్టించుకోరు. వారు తమ భాగస్వామితో విడిపోయే అవకాశం గురించి ఆలోచించరు. పెళ్లి జీవితం బాధిస్తున్నా.. వారు దానిని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తారు.