HERE IS THE LIST OF FAVORITE FLOWERS OF HINDU GODS NS
Hindu Gods Favorite Flowers: ఏ దేవుడిని ఏ పువ్వుతో పూజిస్తే మంచిదో తెలుసా?.. ఇలా పూజిస్తే దైవానుగ్రహం.. తెలుసుకోండి
ప్రతీ దేవుడికి ఓ ప్రీతికరమైన పువ్వు ఉంటుంది. ఆ పువ్వులతో పూజిస్తే ఆ దేవుళ్ల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో వివిధ దేవుళ్లకు ఇష్టమైన పువ్వుల వివరాలు మీ కోసం..
మల్లెపూవు హనుమంతునికి చాలా ప్రీతికరమైనది. సర్వత్ర పరిమళించే ఈ మల్లెపూవుతో ఆంజనేయుడిని పూజిస్తే మీకు అంతా మంచే జరుగుతుందని నమ్మకం. ఈ పువ్వు అత్యంత సువాసనతో కూడిన ఔషధ మొక్కగా కూడా పరిగణించబడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
సరస్వతి దేవిని మోదుగ పుష్పంతో పూజించాలని పెద్దలు చెబుతున్నారు. ఈ పువ్వులు జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఈ పుష్పంతో పూజించడం వల్ల అమ్మవారి ఆశీర్వచనాలు అందుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఎర్రజిల్లేడు పువ్వు వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. ఈ పువ్వుతో గణేశుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని విశ్వాసం.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
తులసి: తులసి పువ్వు విష్ణువు మరియు కృష్ణుడి ఆరాధనకు తప్పనిసరిగా సమర్పించాలి. తులసితో విష్ణుపూజలు పుణ్యప్రదములు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఎర్ర మందార: కాళీ, చాముండేశ్వరీ పూజలో ఎర్ర మందార ఉంచితే మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
కమలం: లక్ష్మీ పూజ సమయంలో తామర పువ్వును ఉఫయోగించండి. కమలం సంపద మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా నమ్ముతారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
పారిజాత పుష్పం విష్ణువుకి ఇష్టమైన పుష్పం. సముద్ర మథనం సమయంలో చెట్టు బయటకు వచ్చింది. విష్ణువు ఈ పువ్వును స్వర్గానికి తీసుకువచ్చాడని పురాణాలలో చెప్పబడింది. కాబట్టి ఇది ఆ దేవుడికి ఇష్టమైన పువ్వు.(ప్రతీకాత్మక చిత్రం)