ఈ సందర్భంగా జగన్మాతను తొమ్మది అవతారాల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే నవరాత్రి ఉత్సవాలను వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంట్లో శాంతి, శ్రేయస్సును నిరోధించే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం చేయాల్సిన పనులను ఇప్పుడు పరిశీలిద్దాం.
* మామిడి తోరణం : హిందువులు ప్రతి పండుగకు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కడుతుంటారు. ఎందుకంటే మామిడి ఆకులను శుభప్రదంగా భావిస్తారు. నవరాత్రుల సందర్భంగా మామిడి తోరణాన్ని గుమ్మానికి కడితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అయితే తాజా మామిడి ఆకులను ఎర్రటి దారంతోనే తోరణం కట్టాలి. తొమ్మిది రోజుల పాటు మామిడి తోరణాన్ని కట్టాల్సి ఉంటుంది.
* అఖండ జ్యోతి : అఖండ జ్యోతి అనేది అంతరాయం లేని ప్రకాశాన్ని సూచిస్తుంది. నవరాత్రులలో అఖండ జ్యోతిని తప్పనిసరిగా వెలిగించాలి. దీంతో దుర్గమ్మ ఆనందంగా ఇంట్లోనే ఉంటుందని భక్తుల నమ్మకం. ఉపవాస సమయంలో అఖండ జ్యోతి వెలుగును స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో అఖండ జ్యోతి కాంతి ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అయితే ఈ ప్రక్రియ నవరాత్రుల మొదటి రోజున చేయాల్సి ఉంటుంది.
* ఇంట్లో నీటి పాత్రను ఉంచండి : వాస్తు ప్రకారం ఇంట్లో నీటి పాత్రను ఉంచడం వల్ల సంతోషాన్ని తీసుకొస్తుంది. దీంతో ఇంట్లో వాతావరణం సామరస్యంగా, శ్రేయస్కరంగా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో నీటితో నిండిన కుండను ఉంచుకుంటే డబ్బు సమస్యలు దూరం అవుతాయి. ఎల్లప్పుడూ సంపదకు లోటు ఉండదు. నీరు ప్రశాంతతకు సంకేతం. అందుకే ఇంట్లో వాటర్ ఎలిమెంట్ కారణంగా ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక, నవరాత్రుల సమయంలో మహిళలు లేదా పురుషులు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు కూడా చేయకూడదు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )