సాధారణంగా మన జీవితంలో స్నేహితులు, ప్రేమికులు ఇద్దరూ ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు. పరిస్థితిని బట్టి మనం వీరిలో ఒకరి కంటే మరొకరికి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఎల్లప్పుడూ లవర్‌కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వారితోనే ఎక్కువ సమయం గడుపుతూ ఫ్రెండ్స్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. జీవితంలోకి లవర్ రానంతవరకు స్నేహితులనే అంటిపెట్టుకొని, లవర్ వచ్చాక వారిని వదిలేసి తిరగకూడదు. (PC : Shutterstock)
ఇలా చేస్తే విలువైన స్నేహితులను బాధించినట్లు అవుతుంది. అయితే నాలుగు రాశుల వారు (Zodiac Signs) మాత్రం ఇవేమీ పట్టించుకోరు. వీరు తమ జీవితంలోకి లవర్ వచ్చిన వెంటనే స్నేహితులను లైఫ్‌లో నుంచి పూర్తిగా కట్ చేసేస్తారు. వారి కాల్స్ లిఫ్ట్ చేయరు, మెసేజ్‌లకు కూడా రిప్లై పంపరు. మరి ఇలాంటి ప్రవర్తన గల ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
* మేషం : మేషరాశిలో జన్మించిన వ్యక్తులలో మొండితనం కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా స్వార్థపరులు కూడా. ఎవరు ఎంత బాధపడినా వీరు చలించని మనస్తత్వంతో ఉంటారు. స్వార్థంగా ఉండే ఈ రాశి వారు ఎక్కువగా తమ సంతోషమే చూసుకుంటారు. ఈ లక్షణం వల్ల వారు స్నేహం కంటే లవ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాత్కాలిక లవర్ కోసం కూడా మేషరాశి వారు స్నేహితులను దూరం పెట్టేస్తారు. స్నేహితులు వీరితో టచ్‌లో ఉండటానికి ప్రయత్నించినా మేషరాశి వారు మాత్రం అస్సలు పట్టించుకోరు. రొమాంటిక్ పార్ట్నర్యే తమ ప్రపంచం అన్నట్లు స్నేహితులను పూర్తిగా వదిలేస్తారు.
* కర్కాటకం : కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు. ఈ రాశి వారు రొమాంటిక్ రిలేషన్షిప్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. లవ్ కోసం వీరు క్లోజ్ ఫ్రెండ్తోనైనా స్నేహాన్ని చాలా తేలికగా ముగిస్తారు. మూడీగా ఉండే వీరు తమ ప్రపంచం మొత్తం లవర్ చుట్టే తిరిగేలా వ్యవహరిస్తారు. ఈ ప్రవర్తన స్నేహితులను బాధించవచ్చు. కర్కాటక రాశి వారి లవర్ కారణంగా నిరాశకు గురైనా ఆ కోపాన్ని, బాధను స్నేహితుల మీదనే వెళ్లగక్కుతారు. అలాంటి సందర్భంలో వీరికి, స్నేహితులకి మధ్య దూరం మరింత పెరుగుతుంది. చివరికి స్నేహం చెడిపోతుంది.
* సింహం : సింహరాశి వారు తమకు కావలసిన దానిపైన దృష్టి పెడతారు. తమ కోరికలను అవసరాలను తీర్చుకుంటూ తమ సంతోషమే ముఖ్యంగా వ్యవహరిస్తారు. వీరి లైఫ్‌లోకి లవర్ వస్తే.. ఫ్రెండ్స్‌ని పెద్దగా పట్టించుకోరు. తమ స్నేహితుల అవసరాల కంటే సొంత అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితంగా స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి. మొత్తానికి సింహ రాశి వారు రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించినప్పుడు స్నేహితులకు దూరమవుతారు.
* వృషభం : వృషభ రాశివారికి కొత్త స్నేహాలను ఏర్పరుచుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే వారు కొత్త వారితో స్నేహం పెంచుకుంటున్న కొద్దీ తమ పాత స్నేహితులను మర్చిపోతారు. ఇక వీరు లవ్‌లో పడినప్పుడు.. స్నేహితుల కంటే వారి భాగస్వామికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఇది ఫ్రెండ్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌కి దారితీస్తుంది. చివరికి వీరికి, స్నేహితులకి మధ్య కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆ విధంగా రొమాంటిక్ రిలేషన్ వల్ల వీరి స్నేహం దెబ్బతింటుంది.