ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ మనకు మన డ్రీమ్ జాబ్‌ని తెచ్చుకునేందుకు సహకరిస్తుంది. కెరీర్లో గ్రోత్ ఉండాలనుకుంటే ఇంట్లో ఈ చిన్న చిన్న వాస్తు టిప్స్(Vastu Tips) పాటించి చూడండి. ఈ వాస్తు టిప్స్ పాటించడంతో పాటు ముందు భగవంతుడిపై నమ్మకం ఉంచండి. పెద్దల ఆశీర్వాద బలం ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కలిసి మీకు ఉద్యోగం విషయంలో కలిసి వస్తాయి.
* ఆ దిశలో కూర్చోండి : దక్షిణ(South) దిశలో ఎలాంటి కిటికీలను ఉంచుకోకండి. ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈస్ట్-సౌత్-ఈస్ట్ మూలలో కూర్చోండి. తద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ప్రొడక్ట్ సేల్స్ చేయడం ద్వారా విజయం సాదించాలని అనుకుంటే ఆ ఉత్పత్తులను ఇంట్లో నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంచండి. వాయువ్యం వాయు దేవుడి స్థానం కాబట్టి ఆ పనులు కలిసి వస్తాయి.
* ఆర్థికపరమైన పనులు ఇలా.. : ధనానికి, సంపదలకు రాజు కుబేరుడు కాబట్టి ముఖ్యమైన, ఆర్థిక పరమైన పనులు చేసేప్పుడు ఉత్తరం వైపు కూర్చుని ఆ పని చేయడానికి ప్రయత్నించండి. సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ల్యాప్‌టాప్, మొబైల్... లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో పని చేస్తుంటే గనుక దాని ఛార్జింగ్ పాయింట్ గదిలో ఆగ్నేయ మూలలో ఉండేలా చూసుకోండి. ఆగ్నేయం అగ్నిదేవుడి స్థానం కాబట్టి కలిసి వస్తుంది.
మనం ఇంట్లో ఊరికే కూర్చునే హాలు, ఉద్యోగం పనులు చూసుకునే వర్క్ ప్లేస్, భోజనం చేసే డైనింగ్ హాల్, వంట చేసుకునే కిచెన్, నిద్రించే బెడ్ రూం... ఇలా ప్రతి ప్లేస్కీ ఓ లెక్క ఉంటుంది. ప్రతీ దిశకూ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. దానికుండే ప్రాధాన్యం వేరుగా ఉంటుంది. ఇవన్నీ మన శరీర భాగాలపై ఏదో ఒక రకంగా ప్రభావం చూపిస్తుంటాయి.